1

Tuesday, October 2, 2007

మరిచిపోలేని ఒక హాస్య సన్నివేశం

మా నాన్న గారి మిత్రుల్లో ఒకతనికి నాటకాలు వేయటం అంటే పిచ్చి (అంటే అంత ఇష్టం అన్నమాట).ఆయన ఒకసారి

యమధర్మరాజు పాత్రని పోషించాల్సి వచ్చంది.అప్పుడు ఆయన నాటకం సహజంగా ఉండేందుకు రంగస్థలం పైకి ఒక

దున్నపొతు మీద కూర్చోని వచ్చారు.సహజంగా నాటకానికి నేపధ్య సంగీతం మ్రోగించగానే ఆ దున్నపొతు

బెదిరిపోయి వీక్షకుల్లొకి పరుగులెత్తింది. దాంతో నాటకం అంతా రసభాసగా మారింది. అప్పటి నుంచి ఆయన్ను

తలుచుకుంటె చాలు ఆ సన్నివేశం గుర్తొచ్చి నవ్వువస్తుంది

Saturday, September 29, 2007

టీచరు -- బబ్లూ

ఒక సారి తరగతి లో టీచరు బబ్లూను 5+5 ఎంతవుతుంది? అని అడుగుతుంది

అప్పుడు మన బబ్లూ వేళ్ళతో 1,2,3... అలా ఎంచటం మొదలెడుతాడు.

అప్పుడు టీచరు వేళ్ళతో కాదు అంటుంది.

అప్పుడు బబ్లూ జేబులో పెట్టుకోని టకటక లోలోపలే వేళ్ళతో యెంచి 5+5=11 అని సమాధానం ఇస్తాడు !

Monday, September 24, 2007

బబ్లూ --- చీమ

ఒక రోజు బబ్లూ వాళ్ళ నాన్న తో..........

బబ్లూ : నాన్నా నాన్నా నేను ఒక మంచి పని చేశాను

నాన్న : యేమిట్రాది బబ్లూ?

బబ్లూ : నేను ఒక చీమను నీళ్ళలోంచి తీశాను.

నాన్న : మరి అది బ్రతికిందా?

బబ్లూ : లేదు నాన్నా, అది నీళ్ళు తాగిందని పొట్ట నొక్కాను అంతే అది చచ్చింది నాన్న, ఎందుకు....!?

Friday, September 21, 2007

వెర్రి వెంగళప్ప -- కీబోర్ద

వెర్రి వెంగళప్ప మొదటి సారి కంప్యూటర్ కీబోర్ద్ చుడగానే ఏమి చేశాడో

తెలుసా ? .....................................................................................................................................................

....................................................................................................................................................................


అడ్డ దిడ్డంగా ఉన్న కీబోర్ద్ అక్షరాలను సరి చేయలని చుశాడు

Monday, September 3, 2007

టీచర్ - విధ్యార్ది


టీచర్ : హుసేన్ సాగర్ లోని బుధ్ధ విగ్రహం ఎందుకు ఒక చెయ్యి పైకి ఇంకో చెయ్యి నొటి దగ్గరికి వుంటుంది


విధ్యార్ది : హుసేన్ సాగర్ లోని నీరు త్రాగుతే పైకి పోతారని తెలుపటుకు టీచర్

Monday, August 27, 2007

పాపం పనోడు

ఓ సారి వెర్రి వెంగలప్ప తన పని వాణ్ణి పెరట్లోని మొక్కలకు నీళ్ళు పట్టమంటాడు. అప్పుడు ఆ పనివాడు బయట వర్షం కురుస్తోందని సమధానం ఇస్తాడు. అప్పుడు వెంగలప్ప కోపంగా ఓరి బండ వెదవ గొడుగు తీసుకెల్లి నీళ్ళు పట్టు పో అని గజమాయిస్తాడు

Saturday, August 25, 2007

తెలివైన ప్రెమికుడు

అమ్మాయి : రేపు నా పుట్టిన రోజు

అబ్బాయి : నీకేం కావాలొ అడుగు నేను ఇస్తాను

అమ్మాయి : నాకు ఒక రింగ్ ఇవ్వవా

అబ్బాయి : ఓసి ఇంతేనా తప్పకుండా ఇస్తాను ల్యాండ్ లైన్ నుంచా లేక సెల్ నుంచా ?!

2

4